Tuesday 4 August 2015

మట్టే మనిషికి సాక్ష్యం

               మనిషి మనుగడంతా మట్టి గడ్డపైనే కొనసాగుతుంది. చివరికి మనిషి కట్టె మట్టిలోనే కలిసి పోతుంది. మట్టితో నిర్మింపబడిన మనిషి మట్టి నిండిన భూమి కోసం, భుక్తి కోసం పడరాని పాట్లన్నీ పడుతూ లేస్తూ చివరికి మిగిలించుకునేదంతా మట్టి సమానమే చేసి మట్టిలోకే వెళ్లి పోతాడు. మట్టి శాస్వతం. మట్టి మనిషి చేసే మంచి శాస్వతం. సంతానము శాస్వతం కాదు. సంపాదన శాస్వతం కాదు. మట్టి పాత్ర అనంతం.
 - గుండూర్ శ్యామ్ , తెల్కపల్లి